భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 47 ఏళ్ల లక్ష్మణ్‌ను గత నెలలో భారత క్రికెట్ బోర్డు అతడిని NCA క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఎంతో మంది సమర్ధవంతమైన యువకులను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించి, వారిని భారత జట్టు తలుపులు తట్టేలా చేయటంలో కృతకృత్యులయ్యారు. అయితే, రాహుల్ ద్రవిడ్ భారత సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులైనందున ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. లక్ష్మణ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా నియమితులవడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించారు.
వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. కానీ కామెంటేటర్లు, ఆసీస్ క్రికెటర్లు మాత్రం అతడిని వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలిస్తుంటారు. జెంటిల్‌మెన్ గేమ్ గా భావించే క్రికెట్ లో నిజమైన జెంటిల్‌మెన్ గా గుర్తింపు పొందాడు లక్ష్మణ్. తన సహచర క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఇచ్చిన మాట కోసం సొంత ఊరైన హైదరాబాద్‌ను వదిలిపెట్టి బెంగళూరుకు భార్య బిడ్డలతో సహా షిఫ్ట్ అయిపోయారు లక్ష్మణ్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా సోమవారం వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టాడు. కొత్త బాధ్యతను ఒక సవాల్ గా తీసుకుంటానని లక్ష్మణ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ