ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు పై హైకోర్టు తీర్పు

ap govt go on movie tickets, AP High Court, AP High Court suspends GO. 35 over the reduction of movie, AP High Court Suspends Government Order On Cinema Ticket Rates, AP High Court Suspends Government Order On Cinema Ticket Rates Decrease, ap ticket prices, ap ticket rate issue, AP Ticket Rates, HC suspends GO reducing cinema ticket rates, High court orders key reduction in movie ticket prices, High court suspends the ticket rates GO in AP, Mango News, movie ticket rates in ap, new movie ticket rates in ap

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇంతకుముందు ఉన్న పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు పిటిషనర్లకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. గత కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఈ తరహా కొత్త జీవోను తెచ్చింది. దీని ప్రకారం సినిమా టికెట్ రేట్లను పెంచే అధికారం థియేటర్ యాజమాన్యాలకు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే టికెట్స్ అమ్మవలసి ఉంటుంది. దీనిని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వ్యతిరేకించారు.

కాగా, కొత్త సినిమాలు వచ్చినప్పుడు మొదటి వారంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని హైకోర్టులో పిటిషనర్లు వాదించారు. రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 4 =