అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు.. కుర్రాళ్లకు కోహ్లీ సూచనలు

అండర్‌-19 ప్రపంచకప్‌ లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఇంగ్లండ్‌ తో శనివారం భారత జట్టు ఫైనల్‌ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఫైనల్‌ మ్యాచ్ కు ముందు యువ ఆటగాళ్లతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వీడియో కాల్‌లో మాట్లాడి కొన్ని చిట్కాలు చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008లో భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. సీనియర్ జట్టులోకి రావడానికి అండర్-19 వరల్డ్ కప్ ఒక ముఖ్యమైన వేదికగా ఆటగాళ్లు భావిస్తుంటారు. కోహ్లీకన్నా ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, ఇలా పలువురు ప్లేయర్స్ ఒకప్పుడు అండర్-19 జట్టులో సభ్యులే.

కాగా, విరాట్ కోహ్లీ తమతో జరిపిన సంభాషణ వీడియోను అండర్-19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే, రవ్‌జర్ధన్ హంగర్గేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. యువ ఆటగాడు కౌశల్ తాంబే.. ‘ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు గొప్ప ఆటగాడి నుంచి విలువైన సూచన’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరో ఆటగాడు హంగర్గేకర్ పెట్టిన పోస్ట్‌లో ఇలా తెలిపాడు. ‘విరాట్ కోహ్లీ భయ్యాతో చాట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. కోహ్లీ నుంచి క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. ఇది భవిష్యత్తులో మాకు సహాయపడుతుంది’ అని చెప్పాడు. ఇక భారత కెప్టెన్ యశ్ ధుల్ కీలకమైన సెమీఫైనల్లో సెంచరీతో సత్తా చాటడం శుభసూచకం. అలాగే, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కూడా ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. రేపు జరుగబోయే ఫైనల్లో వీరిద్దరూ మరోసారి చెలరేగి భారీ స్కోరు చేయాలని జట్టు భావిస్తోంది. తద్వారా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 3 =