11 మంది కొత్త ఐపీఎస్ లకు గ్రేహౌండ్స్ అసాల్ట్ క‌మాండ‌ర్లుగా పోస్టింగ్

11 IPS Probationers Posted as Assault Commanders, 11 IPS Probationers Posted as Assault Commanders In Telangana, Greyhounds Assault Commanders, Greyhounds Assault Commanders In Telangana, Greyhounds In Telangana, Telangana Assault Commanders, telangana government, Telangana Greyhounds Assault Commanders

హైదరాబాద్ లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ క్యాడర్ కు చెందిన 11 మంది ఐపీఎ‌స్‌ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 11 మంది ఐపీఎస్‌ల‌ను గ్రేహౌండ్స్ అసాల్ట్ క‌మాండ‌ర్లుగా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సెప్టెంబర్ 25, శుక్రవారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

కొత్త‌గా పోస్టింగ్ పొందిన ఐపీఎస్‌ ల వివరాలు:

  • అఖిల్ మ‌హాజ‌న్‌ – 2017 బ్యాచ్‌
  • ఖారే కిర‌ణ్ ప్ర‌భాక‌ర్‌ – 2017 బ్యాచ్‌
  • చెన్నూరి రూపేష్‌‌ – 2017 బ్యాచ్‌
  • నితిక పంత్‌‌ – 2017 బ్యాచ్‌
  • యోగేశ్ గౌతం‌ – 2018 బ్యాచ్‌
  • స్నేహా మెహ్రా‌ – 2018 బ్యాచ్‌
  • హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ – 2018 బ్యాచ్‌‌
  • గైక్వాడ్ వైభ‌వ్ ర‌ఘునాథ్‌‌ – 2018 బ్యాచ్‌
  • రితిరాజ్‌‌ – 2018 బ్యాచ్‌
  • బిరుద‌రాజు రోహిత్ రాజు‌ – 2018 బ్యాచ్‌
  • బి.బాల‌స్వామి‌ – 2018 బ్యాచ్‌

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu