మంత్రి ఈటలపై ఆరోపణలు, దర్యాప్తు జరిపి రిపోర్టు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR Orders to Probe into Charges Against Health Minister Eatala Rajender,CM KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Pressmeet,CM KCR Orders Probe Into Charges Against Eatala Rajender,KCR Orders Probe Into Eatala Rajender's Land Grab,Telangana CM KCR Orders Probe Into Land Grabbing Allegations Against Cabinet Minister Etela Rajender,Eatala Rajender For Probe Into Land Grab Charges Against Eatala Rajender,KCR Orders Probe Into Land Grabbing Charges Against Eatala Rajender,Telangana Land Encroachment,Health Minister Eatala Rajender,Eatala Rajender,Minister Eatala Rajender,Eatala Rajender Latest News,Eatala Rajender News,Eatala Rajender Live,Eatala Rajender PressMeet

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం కేసీఆర్ అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ముందుగా తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు రైతులు సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని, గ్రామస్థులను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ప్రతిని సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్ హరీశ్‌ లకు కూడా రైతులు పంపించారు. ఈ క్రమంలోనే రైతుల ఫిర్యాదుపై స్పందిస్తూ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =