ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు నమూనా విడుదల, గంటకు 180 కిలోమీటర్ల వేగం

Delhi–Meerut Regional Rapid Transit System, Design of India first rapid train unveiled, First Look of India First RRTS Train, First Look of India First RRTS Train Unveiled, First look of rapid train, First RRTS train for Delhi-Ghaziabad-Meerut corridor, India First RRTS Train, India First RRTS Train Unveiled, India’s first RRTS train design unveiled, Regional Rapid Transit System, rrts train

భారతదేశపు మొట్ట మొదటి రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్) రైలు ఫస్ట్ లుక్‌ను ఎన్‌సీఆర్‌టీసీ చైర్మన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా శుక్రవారం నాడు ఆవిష్కరించారు. హై-స్పీడ్, హై-ఫ్రీక్వెన్సీ ఆర్‌ఆర్‌టీఎస్ ప్రయాణికుల రైళ్లను పూర్తిగా ప్రభుత్వ “మేక్ ఇన్ ఇండియా” కింద తయారు చేయడం చాలా గర్వకారణమని ఆయన అన్నారు. ఫేజ్-1 లో ముందుగా ఢిల్లీ-ఘజియాబాద్‌-మీరట్‌ మధ్య 82 కిలోమీటర్ల దూరంలో ఈ అత్యాధునిక రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ఆర్‌ఆర్‌టీఎస్ రైళ్లను ముందుగా ఈ క్యారిడార్ లో ప్రవేశపెడుతున్నారు. ‌ఢిల్లీ నుంచి మీరట్ కు రోడ్డుమార్గంలో 3-4 గంటలు పడుతుండగా, ఈ రైళ్ల వలన‌ ప్రయాణం సమయం 60 నిమిషాలకు తగ్గనుంది. ఈ మార్గంలో విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించిన తరవాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందుగా కారిడార్ లో కొంతభాగం వరకు ఈ రైళ్ల సేవలను 2023 లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొత్తం కారిడార్ 2025 లో ప్రారంభించనున్నారు. అలాగే ఆర్‌ఆర్‌టీఎస్ ఫేజ్-1 లో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్-ఎస్‌ఎన్‌బి మరియు ఢిల్లీ-పానిపట్ కారిడార్ లలో కూడా పనులు ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =