పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Review on Purchase of Rainy Season Crops, CM KCR will Held Review on Purchase of Rainy Season Crops, Purchase of Rainy Season Crops, Purchase of Rainy Season Crops In Telangana, Rainy Season Crops, Regulatory Farming Method, Telangana Agricultural News, telangana agriculture budget, Telangana Agriculture News, Telangana CM KCR

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నారు.

అలాగే యాసంగి సమయంలో పంటల సాగు విధానంపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకోనున్నారు. గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? వాటికి ఎంత ధర వచ్చింది? తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా సీఎం కేసీఆర్ ముందుగానే అధికారులను ఆదేశించారు. యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై కీలకంగా చర్చించి, ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =