తెలంగాణలో ఇప్పటికే ఒక వైపు కరోనా కేసులు మరో వైపు వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త రకం వ్యాధి హైదరాబాద్ ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. ఆ వ్యాధి పేరు స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫస్ కీటకాలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. బాధితుల్లో పిల్లలు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ రకమైన వ్యాధితో ఇప్పటికి 15 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇప్పటివరకు స్క్రబ్ టైఫస్ (బుష్ టైఫస్) వ్యాధి సోకిన 15 మందికి చికిత్స అందించారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో సబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో కూడా దాదాపు 500 కేసుల వరకు నమోదయినట్లు తెలుస్తోంది. యూపీలో కూడా చాలామంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడినట్లు, కొందరు మృతిచెందినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ కీటకాలు నల్లిని పోలి ఉంటాయి. ఈ పురుగుల కాటు ద్వారా ఇన్ఫెక్షన్ ప్రజలకు వ్యాపిస్తుంది. స్ర్కబ్ టైఫస్ పురుగులు ఇళ్లల్లో మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఈ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయని, ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ పురుగు కుడితే తీవ్రమైన చలిజ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. కాటుకు గురైన 10 రోజులలోపు ఈ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇన్ఫెక్షన్ సోకిన వారితో సన్నిహితంగా ఉండరాదు. ఎందుకంటే, స్క్రబ్ టైఫస్‌ను నివారించడానికి ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. స్క్రబ్ టైఫస్ నివారణకు.. పడుకునే సమయంలో పిల్లలకు చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులను తొడగాలని, వీలయితే దోమతెరలను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లయితే ఆ వ్యక్తికి యాంటీబయాటిక్ డాక్సీసైక్లిన్‌తో చికిత్స చేయాలని, చికిత్స పొందిన వ్యక్తులు త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఈ స్క్రబ్ టైఫస్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ