అపర మేధావికి అద్వితీయ గుర్తింపు – నేడు జాతీయ గ‌ణిత దినోత్స‌వం

December 22 Srinivasa Ramanujan birth anniversary, happy mathematics day, India celebrates 134th birth anniversary of Dr Ramanujan, international day of mathematics 2021, Mango News, National Mathematics Day, National Mathematics Day 2021, National Mathematics Day 2021 December 22 Srinivasa Ramanujan birth anniversary, National Mathematics Day Celebrations, National Mathematics Day On The Occasion Of Srinivasa Ramanujan’s Birthday, Ramanujan’s Birthday, Srinivasa Ramanujan birth anniversary, Srinivasa Ramanujan’s Birthday

ఈ రోజు మన జాతీయ గ‌ణిత‌ దినోత్స‌వం. భార‌తీయ గ‌ణిత శాస్త్రవేత్త, అప‌ర మేధావి అయిన శ్రీ‌నివాస రామానుజన్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని.. ప్ర‌తిసంవత్సరం డిసెంబ‌ర్ 22వ తేదీన జాతీయ గ‌ణిత‌ దినోత్స‌వం జ‌రుపుకొంటున్నాం. శ్రీ‌నివాస రామానుజన్ ద‌శాంశ ప‌ద్ద‌తిని కనిపెట్టి గణితశాస్త్రాన్ని ఒక మలుపు తిప్పారు. రామానుజన్ చిన్నవయసునుంచే గ‌ణితంపై విపరీతమైన ఆస‌క్తి కనబరిచేవాడు. త‌న ప‌న్నెండేళ్ల వ‌య‌సులోనే గ‌ణితంలో రామానుజ‌న్ మంచి గుర్తింపు పొందారు. మ‌ద్రాస్ విశ్వ‌విద్యాల‌యం నుంచి స్కాల‌ర్ షిప్ కూడా సాధించారు. గ‌ణితంలో ఆయ‌న ప్ర‌తిభ‌ను చూసి ఏ డిగ్రీ లేక‌పోయిన‌ప్ప‌టికీ, మ‌ద్రాస్ విశ్వ‌విద్యాల‌యం నెల‌కు రూ.75 స్కాల‌ర్ షిప్ మంజూరు చేసింది. ఆ రోజుల్లో అది చాలా గొప్ప విషయం. రామానుజ‌న్ 75వ జ‌న్మ‌దినోత్సం సంద‌ర్భంగా 1962లో కేంద్ర స‌ర్కార్ ఆయన గౌరవార్థం పోస్ట‌ల్ స్టాంపును కూడా విడుద‌ల చేసింది.

శ్రీ‌నివాస రామానుజ‌న్, త‌మిళ‌నాడులోని ఈరోడ్‌లో 1887 డిసెంబ‌ర్ 22న ఒక నిరుపేద అయ్యంగార్ కుటుంబంలో జ‌న్మించారు. ఎప్పుడూ లెక్కలతో కుస్తీపట్టే రామానుజన్ ని చూసి కొడుకుకు పిచ్చిప‌ట్టిందేమోన‌ని రామానుజ‌న్ తండ్రి భయపడేవారు. దీంతో ఆయ‌న‌కు వివాహం చేయాలని నిర్ణయించారు. వివాహం తర్వాత 1912లో మ‌ద్రాస్ పోర్ట్ ట్ర‌స్టులో రూ.25 జీతంతో క్ల‌ర్క్‌గా ఉద్యోగంలో చేరారు. 1913లో మ‌ద్రాస్ పోర్ట్ ట్ర‌స్ట్ కు వ‌చ్చిన ప్ర‌సిద్ద గ‌ణిత శాస్త్ర‌వేత్త ‘హ‌క‌ర్’ రామానుజ‌న్ ప‌రిశోధ‌న‌లు చూసి ఆశ్య‌ర్య‌పోయి రామానుజ‌న్ క‌నుగొన్న 120 ప‌రిశోధ‌నా సిద్ధాంతాల‌ను కేంబ్రిడ్జి ఫ్రొఫెసర్ జీహెచ్ హార్డీ కి పంపారు. వాటిని ప‌రిశీలించిన హార్డీ రామానుజ‌న్‌ను కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీకి ఆహ్వానించారు.

రామానుజ‌న్ 1914 లో మొద‌టి ప్ర‌పంచ యుద్ధం సమయంలో ఇంగ్లండ్‌ లోని ట్రినిటీ కళాశాల‌లో చేరారు. 1916లో బీఎస్సీ పూర్తి చేశాక, 1917లో లండ‌న్ మ్యాథ‌మెటిక‌ల్ సొసైటీకి ఎంపిక‌య్యారు. 1918 లో ఫెలో ఆఫ్ ద రాయ‌ల్ సొసైటీకి గౌర‌వం ద‌క్కింది. ఈ గుర్తింపు పొందిన రెండో భార‌తీయుడిగా గుర్తింపు పొందారు. అదే సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ పుర‌స్కారం అందుకున్నారు. ఈ గౌర‌వం అందుకున్న మొద‌టి భార‌త‌యుడు రామానుజ‌న్ కావ‌డం విశేషం. అయితే, రామానుజ‌న్ అనారోగ్యం కారణంగా 1919లో భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. 1926 ఏప్రిల్ 26న 32 ఏళ్ల వ‌య‌సులో క్ష‌య వాధితో తుదిశ్వాస విడిచారు. రామానుజ‌న్ జీవిత ఆధారంగా ‘ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ’ పేరుతో సినిమా కూడా విడుద‌లైంది. గ‌ణిత శాస్త్రంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న పుట్టిన రోజును ‘జాతీయ గ‌ణిత దినోత్స‌వం’ గా ప్ర‌క‌టించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =