హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్‌ రేస్.. హాజరైన మంత్రి కేటీఆర్‌, సచిన్‌, రామ్‌చరణ్ సహా పలువురు ప్రముఖులు

Minister KTR Sachin Tendulkar Ram Charan and Other Celebrities Attends For Formula E car Race in Hyderabad,Minister KTR, Sachin Tendulkar, Ram Charan,Other Celebrities Attends,Formula E car Race in Hyderabad,Mango News,Mango News Telugu,Formula E Teams,Formula 1 E Racing,Formula E Drivers,Formula E Gen 3,Formula E Racing Attack Mode,Formula E Racing Brooklyn,Formula E Racing Cars,Formula E Racing Game,Formula E Racing Live,Formula E Racing Rules,Formula E Racing Schedule,Formula E Racing Speeds,Formula E Racing Teams,Formula E Racing Hyderabad,Formula E Standings,Formula E Top Speed,Mahindra Formula E Racing

దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఈ రేస్‌లో ఎలక్ట్రిక్‌ కార్లు గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల సర్క్యూట్‌పై 11 టీమ్‌ల నుంచి మొత్తం 22 మంది డ్రైవర్లు పోటీపడ్డారు. ఇక ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలవగా.. నిక్‌ క్యాసిడీ రెండో స్థానంలో, సెబాస్టియన్‌ బ్యూమీ మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహుమతులు అందజేశారు. ఇక ఈ రేస్‌లను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చారు. వీరితో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో.. క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ సహా ఇతర క్రికెటర్లు శిఖర్ ధావన్‌, యజ్వేంద్ర చాహల్‌, సినీ నటులు నాగార్జున, రామ్‌చరణ్, నాగచైతన్య, అఖిల్‌ తదితరులు హాజరయ్యారు.

కాగా ఫార్ములా ఈ రేస్‌ పోటీలకు ఇప్పటికే అనేక నగరాలు శాశ్వత ప్రాతిపదికన ఆతిథ్యమిస్తున్నాయి. వీటిలో.. లండన్‌, బెర్లిన్‌, దిరియా, మొనాకో, రోమ్‌, జకార్తా, సియోల్‌, మెక్సికో సిటీ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. అయితే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడంతో ఇకనుంచి ఈ నగరాల జాబితాలో హైదరాబాద్‌ కూడా చేరనుంది. ఇక ఈ ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్‌ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరి రేస్ తర్వాత ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు. కాగా ఎలక్ట్రిక్‌ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక 2014 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా ఈ రేస్‌ ప్రారంభం కాగా చివరిసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఈ క్రమంలో రేస్‌ నేడు హైదరాబాద్‌లో జరుగగా.. దీని తర్వాత దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =