తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700 కు చేరుకుంది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మృతి చెందగా, 186 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఒక్కరోజే 68 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 496 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 17, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 38 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ లో 13, నెల్లూరులో 6, అనంతపూర్, చిత్తూర్ జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4 చొప్పున, కడప జిల్లాలో ఒక కేసులతో కలిపి మొత్తం కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం 523 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 16.04.2020) pic.twitter.com/1AGsNvFZYF
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 16, 2020
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 38 కేసు లు నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసు లకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523. #APFightsCorona pic.twitter.com/35rCkP5RQS— ArogyaAndhra (@ArogyaAndhra) April 17, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]