నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్‌పి) జంతుప్రదర్శనశాలలో ఉన్న ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ లక్షణాల నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ముందుగా కొన్ని లక్షణాలు కనిపించటంతో ఏప్రిల్ 24న సీసీఎంబీ-లాకోన్స్‌తో నమూనాలను అనస్థీషియా కింద ముక్కు, గొంతు మరియు శ్వాసకోశ నుండి సేకరించినట్లు అధికారులు తెలిపారు. శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నందున జంతువులకు పరీక్షలు నిర్వహించి, నమూనాలు సేకరించారు. మే 4, 2021 న సీసీఎంబీ-లాకోన్స్ వివరణాత్మక విశ్లేషణ పరీక్షలు, నివేదిక ఆధారంగా ఎనిమిది ఆసియా సింహాలు సార్స్ కొవ్-2 వైరస్ కోసం పాజిటివ్ గా పరీక్షించినట్టు నిర్ధారించబడింది. అయితే లక్షణాలు కనిపించిన రోజు (ఏప్రిల్–24) నుంచే మందు జాగ్రత్తగా జూ అధికారులు, సిబ్బంది చికిత్స ప్రారంభించారని, దీంతో సింహాలు అన్నీఇప్పటికే బాగా కోలుకున్నాయి. సాధారణ స్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
“నమూనాల యొక్క మరింత విశ్లేషణ జంతువులకు వ్యాధిసంక్రమణకు ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు. ఎనిమిది సింహాలను ముందుగానే వేరుగా (ఐసోలేషన్) చేసి, తగిన జాగ్రత్తలతో పాటు అవసరమైన చికిత్స అందించారు. ఎనిమిది సింహాలూ చికిత్సకు బాగా స్పందించి కోలుకున్నాయి.అవి మామూలుగా ప్రవర్తిస్తున్నాయి, ఆహారం బాగా తింటున్నాయి. జూ సిబ్బందికి కరోనా సోకకుండా నివారణ చర్యలు చేపట్టాం. సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల మేరకు జూను ఇప్పటికే మూసివేయబడింది. సందర్శకులకు అనుమతి లేకుండా చర్యలు తీసుకున్నాం” అని అధికారులు తెలిపారు.
సార్స్ కొవ్-2 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జంతుప్రదర్శనశాలలు చేపట్టాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు, సలహాల జారీ చేశామని సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్ జూ అథారిటీ అనేక ముందస్తు చర్యలు తీసుకుందని, నివారణ, నమూనా సేకరణ, అనుమానిత కేసులలో గుర్తించడం, జంతు సంరక్షకుల కోసం భద్రతా ప్రోటోకాల్స్ మొదలైన వాటి కోసం పర్యవేక్షణ అండ్ మార్గదర్శకాలు ఇచ్చామని సెంట్రల్ జూ అథారిటీ తెలిపింది. శాస్త్రీయ సంస్థలు, నిపుణులతో సంప్రదించి జంతుప్రదర్శనశాలలకు మార్గదర్శకాలు సూచించబడ్డాయి. తదుపరి దశల్లో భాగంగా, నిపుణులతో సంప్రదించి కోవిడ్ జాగ్రత్తల కోసం కొత్త మార్గదర్శకాలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. గత సంవత్సరం ప్రపంచంలోని సార్స్ కొవ్-2 పాజిటివ్‌ను అనుభవించిన జూ జంతువులతో అనుభవం ఆధారంగా, జంతువులు ఈ వ్యాధిని మానవులకు వ్యాప్తి చేయగలవని ఎటువంటి వాస్తవమైన ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ