ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం సహాయం : సీఎస్

CS Somesh Kumar, Delegation of DICCI Meets Telangana Chief Secretary, DGP, DICCI Meets Telangana Chief Secretary Somesh Kumar, Mango News Telugu, Somesh Kumar, telangana, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Meeting, Telangana News, Telangana Political News

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యువతలో వ్యవస్థాపకత (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) పెంపొందించటానికి అవసరమైన సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బిఆర్ కెఆర్ భవన్ లో డీఐసీసీఐ బృందం (దళిత్‌ ఇండియన్ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) సీఎస్ సోమేశ్ కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వీకర్ సెక్షన్ కు సంబంధించిన వారు పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించటానికి, వారు వివిధ రంగాలలో రాణించడానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. డీఐసీసీఐ ద్వారాఎంటర్ ప్రెన్యూర్ షిప్ పెంపొందించటం కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

వివిధ పరిశ్రమలలో డీఐసీసీఐ ఇన్నోవేటివ్ ఐడియాలు అమలు చేస్తున్నందుకు సీఎస్ అభినందిస్తూ జాతీయ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ లు రోల్ మోడల్ గా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వం సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ద్వారా విజయవంతంగా శిక్షణను అందిస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామారావు ఆధ్వర్యంలో పరిశ్రమల రంగంలో తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎస్ వారిని కోరారు. డీఐసీసీఐ ప్రతినిధులు అరుణ దాసరి, రవి కుమార్ నర్రా, రాహుల్ కిరణ్, సురేష్ నాయక్, మున్నయ్య తమనం, మునీంధర్, రమేశ్ నాయక్, వెంకటేశ్వర్ రావు, పరమేశ్ లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ