కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు లైసెన్సింగ్‌ అనుమతి మంజూరు

Bharat Biotech Covaxin, Bharat Biotech Covaxin Vaccine, Bharat Biotech Gets Licensing Permission to Covaxin, Bharat Biotech Recruits 23, Bharat Biotech Recruits 23000 Volunteers, Coronavirus COVAXIN, coronavirus news, Coronavirus News Updates, coronavirus vaccine, Coronavirus Vaccine COVAXIN, Coronavirus Vaccine In India, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, COVAXIN Phase III Trials, Covaxin Vaccine, COVID 19 Vaccine, Mango News, Permission to Covaxin for Manufacture and Sell

భారత్‌ బయోటెక్‌ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కరోనా వ్యాక్సిన్ కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ భారత్ బయోటెక్‌కు కొవాగ్జిన్ అమ్మకం లేదా పంపిణీ కోసం లైసెన్సింగ్‌ అనుమతిని మంజూరు చేసింది. అయితే భారత్ బయోటెక్ సంస్థ 2 నెలలు పాటుగా ప్రతి 15 రోజులకు, ఆ తరువాత నెలవారీగా విశ్లేషణతో కూడిన సేఫ్టీ డేటాను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా సమర్పించాలని సూచించారు.

మరోవైపు పేజ్-3 క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికి 23,000 మంది వాలంటీర్లను నమోదు చేసుకునట్టు భారత్‌ బయోటెక్ ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో 26 వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా లక్ష్యం నిర్దేశించుకోగా, అందులో ఇప్పటికి 23,000 మంది వాలంటీర్లను నమోదు పూర్తిచేసుకునట్టు తెలిపారు. దేశంలో ఏ టీకాకైనా ఇప్పటిదాకా నిర్వహించిన పేజ్-3 సమర్థత ట్రయల్స్ లో ఇదే అతి పెద్దదని భారత్ బయోటెక్ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =