ప్రముఖ నటుడు రాజశేఖర్ కుటుంబానికి కరోనా పాజిటివ్

Actor Rajasekhar and his Family Members Tested Positive for Covid-19

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌ తో పాటుగా, ఆయన కుటుంబ సభ్యులుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “జీవిత, పిల్లలు మరియు నాకు కరోనా పాజిటివ్ తేలిందని మరియు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని వస్తున్న వార్తలు నిజం. పిల్లలు ఇద్దరూ కరోనా నుండి పూర్తిగా బయటపడ్డారు. జీవిత మరియు నేను కూడా ఆరోగ్యంగానే ఉన్నాము. త్వరలోనే ఇంటికి తిరిగి చేరుకుంటాం. ధన్యవాదాలు” అని రాజశేఖర్ ట్వీట్ చేశారు. దీంతో రాజశేఖర్ దంపతులు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు ప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu