కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ పర్యటన, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

Kalwakurthy Lift Irrigation Pump House Issue: Congress MP Revanth Reddy, Other Leaders Arrested

నాగర్‌ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురి కాంగ్రెస్ నేతలను తెలకపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని నాయకులను పంప్ హౌస్ సందర్శనకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ రహదారిపై నిరసనకు దిగారు. ఈ సందర్భంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత నెలకుంది. పరిస్థితి తీవ్రం కాకుండా ఎంపీ రేవంత్ రెడ్డి‌, మల్లు రవి, సంపత్‌కుమార్‌ సహా ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here