హైదరాబాద్‌లో తిరంగా యాత్రలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

AIMIM Chief Asaduddin Owaisi Participates in Tricolor Yatra at Hyderabad Today, AIMIM Chief Asaduddin Owaisi , Tricolor Yatra at Hyderabad , Owaisi Brothers Hoist Tricolour In Hyderabad , Owaisi Brothers Hoist Tricolour , Asaduddin Owaisi , Mango News, Mango News Telugu, All India Majlis-e-Ittehadul Muslimeen, AIMIM Latest News And Updates, AIMIM PARTY, AIMIM Live Updates, Asaduddin Owaisi Participates Tricolor Yatra , Tricolor Yatra

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సెప్టెంబరు 17 చుట్టూ నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారు విడివిడిగా అధికారికంగా దీనిని నిర్వహిస్తున్నాయి. అదికూడా వేర్వేరు పేర్లతో నిర్వహించనుడటం గమనార్హం. తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలు పేరుతో కేంద్రం, తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా మరోవైపు హైదరాబాద్ నగరంలో మంచి పట్టున్న ఏఐఎంఐఎం పార్టీ కూడా దీనిలో భాగం కానుంది. సెప్టెంబరు 17 కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఆ పార్టీ ‘తిరంగా యాత్ర’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వం వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం భారీ సంఖ్యలో ముస్లింలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా కేంద్రం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలసి పోరాడారని, తురేబాజ్‌ ఖాన్‌ వీరోచిత పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY