తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల

Coronavirus, COVID-19, COVID-19 in Telangana, Covid-19 Updates in Telangana, Mango News, Telangana 1380 New Positive Cases 3877 Recoveries Reported on FEB 7th, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను సోమవారం నాడు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 10వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించనున్నారు. అలాగే జనరల్, ఒకేషనల్ కోర్సులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 11 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు ఏప్రిల్ 12న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 20: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
 • ఏప్రిల్ 22: ఇంగ్లీష్ పేపర్-1
 • ఏప్రిల్ 25: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, పొలిటికల్ సైన్స్ పేపర్- 1
 • ఏప్రిల్ 27: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
 • ఏప్రిల్ 29: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
 • మే 2: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
 • మే 6: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
 • మే 9: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

 • ఏప్రిల్ 21: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
 • ఏప్రిల్ 23: ఇంగ్లీష్ పేపర్ -2
 • ఏప్రిల్ 26: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, పొలిటికల్ సైన్స్ పేపర్- 2
 • ఏప్రిల్ 28: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
 • ఏప్రిల్ 30: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
 • మే 5: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2
 • మే 7: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
 • మే 10: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =