సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల

Apollo Hospitals Released Health Bulletin on Condition Of Senior Actor Kaikala Satyanarayana

ప్రముఖ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్చగా, వైద్య బృందం నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్స్ తాజాగా హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. “ఈ రోజు ఉదయం 7:30 గంటలకు జ్వరంతో ఉన్న కైకాల సత్యనారాయణను ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోస్ట్ కోవిడ్ ప్రభావంతో ఆయన ఇంటివద్దనే రెస్పిరేటరీ సపోర్ట్ మరియు ట్రాకియోస్టోమీతో ఉన్నారు. ఆయన మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్ కలిగి వున్నారు. ఆయన పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్య బృందం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. రోగ నిరూపణ మరియు చికిత్సకు ఆశించినంత మేర ఆయన స్పందించటం లేదు” బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు కైకాల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ