ఆడపడుచులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది : జూ.ఎన్టీఆర్

Ap Political News, Balakrishna Press Meet, Chandrababu Assembly Incident, Chandrababu Naidu Latest News, Jr NTR, Jr NTR About Assembly Incident, Jr NTR About Chandrababu Naidu, Jr NTR Latest Movie Updates, Jr NTR Latest News, Jr NTR Responds over Chandrababu Issue and Condemns YCP Leaders Comments, Mango News, TDP, TDP latest news, Young Tiger Jr NTR, Young Tiger Jr NTR Responds over Chandrababu Issue and Condemns YCP Leaders Comments

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శాసనసభలో జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ మీడియా సమావేశంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై నందమూరి బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే మీడియాతో మాట్లాడగా, తాజాగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ ట్విట్టర్ లో ప్రత్యేక వీడియో పోస్ట్ చేశారు.

“అందరికి నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అయితే అవి ప్రజా సమస్యల మీదనే జరగాలి గాని, వ్యక్తిగత దూషణలు, విమర్శలుగా ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని, ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పగించాలి. అంతేకాని కలిచివేసి, కాల్చేసి, రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామని అనుకుంటే అది తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకు గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడడం లేదు. ఈ మాటలు ఒక కోడుకుగా, భర్త, తండ్రిగా, ఈ దేశంలో పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులు అందరికి ఒకటే విన్నపం. దయచేసి ఈ సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని, మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =