కొన్నాళ్లుగా సనత్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆ నియోజకవర్గంలో రెండు సార్లు నల్లేరు మీద నడకలా విజయం సాధించిన నేతలు.. మూడో సారి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశ నెరవేరకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన పొలిటికల్ సీన్లు ఇవే చెప్పడంతో ఈ సారి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా నిలబడుతున్న మంత్రి తలసాని గురించి నెట్టింట్లో చర్చలు షురూ అయ్యారు. ఈ రికార్డును తలసాని శ్రీనివాస్ చెరిపేసి కొత్త రికార్డును క్రియేట్ చేస్తారా లేక పాతవాళ్లనే ఫాలో అవుతారా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును..సనత్‌నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థీ కూడా ఇప్పటి వరకు హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్న రాజకీయ చరిత్ర లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేలుగా కొంతమంది గెలిచినా కూడా వరుసగా ఆ విజయాలను నమోదు చేసుకుని హ్యాట్రిక్ కొట్టిన పరిస్థితులు అక్కడ రాలేదు. సనత్‌నగర్ నియోజకవర్గం 1978లో ఏర్పడగా.. ఇప్పటివరకు మొత్తం 11 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్‌రెడ్డి 1992, 1994 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు కానీ మూడో సారి హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయ్యారు. 1999 ఎన్నికల్లో శ్రీపతిరాజేశ్వర్ గెలుపొందడంతో మర్రి శశిధర్ రెడ్డికి ఆ హ్యాట్రిక్ రికార్డ్ దూరమైంది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో మరోసారి మర్రి శశిధర్ రెడ్డి రెండుసార్లు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నా .. 2014 ఎన్నికలలో మరోసారి పరాజయం పాలయి.. మళ్లీ హ్యాట్రిక్ చాన్స్ మిస్ చేసుకున్నారు. అలాగే 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అదే సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. అయితే తాజాగా మరోసారి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న మంత్రి తలసాని ఈ సారి హ్యాట్రిక్ కొడతారా లేక పాత రికార్డులనే ఫాలో అవుతారా అన్నదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ