వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే ఆ సీనియర్ నేత?

Who is next from BJP,Will Konda Vishweshwar Reddy Etala Rajendar Join In BJP,Who is next from BJP,Vivek, senior leader,Mango News,Mango News Telugu,Konda Vishweshwar Reddy,Etala Rajendar,senior leader followed Viveks path,Konda Vishweshwar Reddy Latest News,Konda Vishweshwar Reddy Latest Updates,Konda Vishweshwar Reddy Live News,Etala Rajendar Latest News,BJP Latest News,BJP Live Updates
Will Konda Vishweshwar Reddy Etala Rajendar Join In BJP,Who is next from BJP,Vivek, senior leader,

శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానికి షాక్ ఇస్తూ ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరుకోగా.. తాజాగా వివేక్ వెంకటస్వామి కూడా కాషాయ  పార్టీకి బైబై చెప్పి  కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ లిస్టులో మరో సీనియర్ నాయకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా హస్తం పార్టీవైపు  పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ పెద్దలు.. మూడో లిస్టుపై ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు  టాక్ వినిపిస్తోంది.  జనసేనకు ఇవ్వబోయే సీట్ల సంఖ్యను..  ఆ నియోజకవర్గాలను  అధిష్టానం ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  11 సీట్లు జనసేనకు ఇచ్చేందుకు  సిద్ధమయిన బీజేపీ అధిష్టానం..సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గాన్ని కూడా జనసేన కోసం వదులు కోవడానికి  రెడీ అయిందట.

ఇక మిగిలిన పది సీట్లను దాదాపు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాలు ఏపీతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అక్కడ జనసేనను నిలబెడితే కలిసొస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.మరోవైపు సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని  శేరిలింగంపల్లి సీటును జనసేనాని డిమాండ్ చేయడంతో ఆ సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు వినిపిస్తున్నాయి.

మరోవైపు శేరిలింగంపల్లి సీటు విషయంలో..  కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును..పొత్తు పేరుతో జనసేనకు ఎలా ఇస్తారని ఆయన గుర్రుగా ఉన్నారట. అంతేకాదు ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేస్తున్న  మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు అయిన  రవియాదవ్‌కే సీటు కేటాయించాలని.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్దిరోజులుగా బీజేపీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారట. దీంతో ఈ సీటును రవియాదవ్‌కు ఇవ్వకపోతే మాత్రం.. తాను కూడా  బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శేరిలింగం పల్లి సీటుపై బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడ్డారట.

మరోవైపు ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడితే ఆయన బాటలోనే మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈటల రాజేందర్ రెడ్డి భార్య జమునా రెడ్డి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  దగ్గరి బంధువవుతారు. దీంతో  ఒక పార్టీలోనే ఉండాలని వీళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =