దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు పేరు ఖరారు

BJP Announces M Raghunandan Rao As a Candidate for Dubbaka, Dubbaka By election, M Raghunandan Rao

మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్‌ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నికకు సీనియర్‌ నాయకుడు ఎం.రఘునందన్‌ రావు పేరును మంగళవారం నాడు బీజేపీ ఖరారు చేసింది. దేశంలో పలు రాష్ట్రాల ఉపఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులతో పాటుగా, తెలంగాణలోని దుబ్బాక స్థానానికి కూడా బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu