టిఆర్ఎస్‌ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నేత రావుల శ్రీధ‌ర్ రెడ్డి

avula Sridhar Reddy Resigns, Big Jolt To BJP As Ravula Sridhar Reddy Resigns, BJP Senior Leader Ravula Sridhar Reddy, BJP Senior Leader Ravula Sridhar Reddy Joins, BJP senior leader resigns from Party, Ravula Sridhar Reddy Joins in TRS Party, Ravula Sridhar Reddy joins trs, Ravula Sridhar Reddy quits BJP, Sridhar Reddy Joins in TRS Party

బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌ రెడ్డి ఆ పార్టీకి ఆదివారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం నాడు తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ స‌మక్షంలో రావుల శ్రీధ‌ర్ రెడ్డి పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి కేటిఆర్ గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీధర్ రెడ్డి చేరిక కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్‌, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజ‌క‌వర్గం నుంచి బీజేపీ తరపున శ్రీధ‌ర్ రెడ్డి పోటీ చేశారు. పలు విషయాల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక, పార్టీపై అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసినట్టు శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ