బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Lays Foundation Stone for Construction of Nursing College Building in Banswada, Harish Rao Lays Foundation Stone for Construction of Nursing College Building in Banswada, Foundation Stone for Construction of Nursing College Building in Banswada, Foundation Stone for Bansuwada Nursing College, Nursing College Building in Banswada, Nursing College In Bansuwada, Bansuwada Nursing College, Minister Harish Rao, Telangana Minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Bansuwada Nursing College News, Bansuwada Nursing College Latest News, Bansuwada Nursing College Latest Updates, Bansuwada Nursing College Live Updates, Telangana Govt, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీనియర్ నాయకులు, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి నుంచి ఒక నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి పనులు చేయాలో నేర్చుకున్నామన్నారు. రైతులు, కార్మికులు, పేదలు ఎవరు అయినా చిత్తశుద్దితో వారి కోసం పని చేసే వ్యక్తి స్పీకర్ పోచారం అని చెప్పారు. బాన్సువాడ వస్తే తెలంగాణ ప్రభుత్వ అభివృధి ఎంటో చూపిస్తానని పేర్కొన్నారు.

ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక నర్సింగ్ కాలేజి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, కాని జిల్లా కూడా కానీ బాన్సువాడలో నేడు 50 కోట్ల ఖర్చుతో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, ప్రాజెక్టులు పూర్తి కావని, నీళ్లు రానే రావని అన్నారన్నారు. కానీ పట్టుదల గలిగిన సీఎం కేసీఆర్ వంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉంది కాబట్టే, దేశంలో కాళేశ్వరంలా ఏ ప్రాజెక్టు ఇంత స్పీడ్ గా పూర్తి కాలేదని చెప్పారు. ఇంత పెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే లేదని, మూడున్నరేళ్లలో పూర్తి చేసి రైతులకు నీరు అందించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =