క్వారంటైన్‌లోకి వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్

Coronavirus, Coronavirus In Inida, coronavirus news, edros Adhanom Under Self Quarantine, edros Adhanom Under Self Quarantine After Contact Tests COVID-19 Positive, WHO Chief, WHO Chief Coronavirus, WHO Chief Tedros Adhanom Under Self Quarantine, WHO Chief Tedros Under Self-Quarantine For COVID-19, WHO chief under self-quarantine

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా ప్రభావం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పై కూడా పడింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ స్వీయ నిర్బంధంలోకి (క్వారంటైన్) వెళ్లారు. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించాను. నేను బాగానే ఉన్నాను మరియు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నాను. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో స్వీయ నిర్బంధంలో ఉంటాను. అప్పటి వరకు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తాను” అని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ‌ట్వీట్ చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 4,65,19,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 12 లక్షల మందికి పైగా మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − one =