లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆ పార్టీని సంక్షోభంలో పడేశాయి.ఒక్కొక్కరుగా పార్టీని మారుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోమని, సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కోసం పోరాడుతామని, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ఉప ఎన్నికలు వస్తాయని.. క్యాడర్ సిద్దంగా ఉండాలంటూ చెపుతున్నారు. బై ఎలాక్ష్హన్స్ జరుగుతాయని సంకేతాలు ఇస్తే క్యాడర్ పార్టీని వీడదని.. పైగా అధికార పార్టీలో తమకు కొత్తగా ప్రాధాన్యత ఉండదని భావించి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారనేది హరీష్ రావు ప్లాన్ గా రాజకీయ విశ్లషకులు చెబుతున్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పుడు కూడా కుట్రలు జరిగాయని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, కానీ కుట్రలు ఫలించలేదని, న్యాయం గెలిచిందని.. కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. నాడు బీఆరెస్ పార్టీ పని అయిపోయిందనన్న వాళ్లు తర్వాత కనిపించకుండా పోయారన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా పోయేదేమి లేదన్నారు. ఎమ్మెల్యే పోCategoriesతే పార్టీ పోదన్నారు హరీశ్ రావు. పదేళ్ల పాలనలో మనం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. కొన్ని విషయాలు విస్మరించామన్న ఆయన… ఇకపై కార్యకర్తలు, నాయకత్వంపై దృష్టిపెడతామన్నారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని… పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా మార్చుతామన్నారు హరీష్. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం స్పీకర్ దే. శాసన వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేవు. పైగా.. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చేసేదేమీ ఉండదు. అయినా కూడా హారీష్ రావు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మాజీలుగా మార్చుతామనే ప్రకటన క్యాడర్ ను తాత్కాలికంగా కాపాడుకునేందు కోసమేనని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ