నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

CM KCR Conducts Review over Irrigation Department

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుండగా, విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ఏకపక్షంగా నీటిని వినియోగిస్తుందని, వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖపై సమీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ