ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్ రావు (68) ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. ఇలపావులూరి చేసే చర్చలు, విశ్లేషణలు, రచనలు ముక్కుసూటిగా వుండేవని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల శ్రేయోభిలాషిగా తెలంగాణ వాదాన్ని వినిపించిన ఇలపావులూరి మరణం బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఇలపావులూరి మురళీమోహన్ రావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా ఇలపావులూరి మురళీ మోహన్‌రావు కుటుంబంతో కలిసి ఆదివారం ఆయన స్వస్థలమైన అద్దంకి కి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఇలపావులూరి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE