తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ పెనాల్టీ ఫీజు రద్దు

Telangana Govt Orders Abolition of The Motor Vehicles Fitness Renewal Late Fee Penalty, Abolition of The Motor Vehicles Fitness Renewal Late Fee Penalty, Telangana Govt Orders Abolition of The Motor Vehicles Fitness, Motor Vehicles Fitness Renewal Late Fee Penalty, transport vehicle owners are not liable to pay late fee penalty of Rs 50 a day to renew fitness of their vehicles, Telangana High Court, Steep penalties, Telangana Govt, fitness certificate, Motor Vehicles Fitness Renewal, Motor Vehicles Fitness Renewal News, Motor Vehicles Fitness Renewal Latest News, Motor Vehicles Fitness Renewal Latest Updates, Motor Vehicles Fitness Renewal Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ లోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ రకాల పన్నుల చెలింపులతో సతమతమవుతున్న ఆటో, ట్యాక్సీ, రవాణా వాహనాల డ్రైవర్లకు భారీ ఉపశమనం కలిగిస్తూ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గడువు ముగిసినా సామర్థ్య ధ్రువీకరణ (ఫిట్‌నెస్‌) తీసుకోని వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించాలన్న నిబంధన నుంచి రవాణా శాఖ మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్య వ్యవధిలో ఇది వర్తిస్తుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఆ సమయంలో పాత ఫిట్‌నెస్‌ పత్రాలు చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

కాగా కేంద్రం సవరించిన ఎంవీ యాక్ట్‌ ప్రకారం ఫిట్‌నెస్‌ ఆలస్యానికి రోజుకు రూ.50 జరిమానా వసూలు చేయాలనే నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాదారుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్ని రకాల మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల ఆలస్య రుసుమును రద్దు చేస్తూ కీలక ఆదేశాలిచ్చింది. ఈ తాజా నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.650 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో లక్షల మంది డ్రైవర్లు, వాహనదారులకు భారీ ఉపశమనం కలుగనుండటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =