రాష్ట్రంలోని యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గురువారం నాడు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, పలువురు టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ వెళ్లొచ్చిన మంత్రులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా మంత్రులు సీఎంకు వివరించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సమావేశం తర్వాత ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ