రాష్ట్రంలో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Exams Postponed Due To Rains, Hyderabad Rains news, Hyderabad Rains Updates, Hyderabad rains.Osmania University postpones exams, Osmania University and JNTU postpone exams, Osmania University Exam Postponed Due to Heavy Rains, Osmania University exams postponed again due to rains, Osmania University Exams Postponed Due, Several Examinations Postponed Under OU

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే వర్షాల వలన ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిల్లో సోమవారం మరియు మంగళవారం నాడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఇక రాబోయే మూడు రోజుల్లో కూడా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు, బీఈడీ పరీక్షలు, ఇతర పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తునట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును కూడా అక్టోబర్ 31 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =