నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

CM KCR Laid Foundation Stone, CM KCR Laid Foundation Stone for 13 Lift Irrigation Schemes, Foundation Stone for 13 Lift Irrigation Schemes, Lift irrigation Scheme, Lift Irrigation Schemes, Lift Irrigation Schemes at Nellikallu, Lift Irrigation Schemes In Telangana, Mango News, Nalgonda District, Nellikallu, Nellikallu in Nalgonda District, Telangana Lift Irrigation Schemes, Telangana Political News

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించే నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలకు నెల్లికల్లు వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి ఆయకట్టు భూములు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here