హైదరాబాద్‌లో ‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, పొరుగు రాష్ట్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR Interesting Comments on Neighbour State Regarding Basic Facilities, Minister KTR Comments on Neighbour State Regarding Basic Facilities, Minister KTR Sensational Comments on Neighbour State Regarding Basic Facilities, Minister KTR has said that Telangana was better than a neighbouring state, KTR Interesting Comments on Neighbour State, Neighbour State Regarding Basic Facilities, Regarding Neighbour State Basic Facilities, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదని, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నగరం దూసుకుపోతోందని ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈరోజు మాదాపూర్‌ హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది అత్యాశతోనే రాష్ట్రంలో స్టీల్ మరియు సిమెంటు ధరలు పెరిగాయని, త్వరలోనే ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మౌలిక వసతులపై వివరిస్తూ, పొరుగు రాష్ట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం విలువ తెలియాలంటే ఒక్కసారి మన పక్కనే ఉన్న రాష్ట్రాలకు వెళ్లి రావాలని సూచించారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని మంత్రి కేటీఆర్‌ సభికులతో పంచుకున్నారు.

గత కొన్ని రోజుల క్రితం తన స్నేహితుడు ఒకరు, సంక్రాతి పండుగ కోసం పక్క రాష్ట్రం లోని తన స్వగ్రామానికి వెళ్లారని.. అయితే అక్కడి పరిస్థితులు చూసి ఆవేదన చెందారని తెలియజేశారు. ఆ రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి కనీస వసతులు ఏమీ సరిగా లేవని తనతో చెప్పారని తెలిపారు. ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి బస్సులు ఏర్పాటు చేసి కొంతమందిని అక్కడికి పంపించమని తన స్నేహితుడు సూచించారని.. అప్పుడు వారికే రెండు రాష్ట్రాల మధ్య పాలనలో తేడా తెలుస్తుందని ఆయన చెప్పారని వివరించారు. అయితే తాను చెబుతుంది అతిశయోక్తి అని మీరెవరైనా భావిస్తే.. ఇప్పుడే మీరు ఒక కారు వేసుకుని ఆ రాష్ట్రానికి వెళ్లి చూసి రావొచ్చు అని మంత్రి ప్రకటించడం విశేషం. ఇతర రాష్ట్రాలో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కాగా జంట నగరాల్లో గృహ పరిష్కారాల కోసం ఉత్తమ ఎంపికలను పొందే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్). ఈ సంవత్సరం, కోవిడ్ ప్రోటోకాల్‌ల కారణంగా ప్రాపర్టీ షోలో పెద్ద స్టాల్ సైజులు, ఎక్కువ ఓపెన్ స్పేస్‌లు, పెద్ద కారిడార్లు మరియు మీటింగ్‌ల కోసం పెద్ద లాంజ్ ఉన్నాయని క్రెడాయ్ శుక్రవారం తెలిపింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈవెంట్‌లో సభ్యులు, డెవలపర్లు, మెటీరియల్ వెండర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు మరియు ఆర్థిక సంస్థలను అన్నింటినీ ఒకేచోటకు చేర్చి వినియోగదారులకు క్రెడాయ్ అద్భుత అవకాశాన్ని కలిగిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eleven =