టిఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఆయన స్వగ్రామమైన పాలెం గ్రామంలో జరిగాయి. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం నోముల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి,పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోముల నర్సింహయ్యకు నివాళులర్పించారు. ముందుగా నోముల అంతిమయాత్రలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ