వ్యవసాయ చట్టాలపై ఆందోళన: రైతు సంఘాల నేతలు, కేంద్రం మరోసారి చర్చలు

Farmer Unions Begin Talks Once Again With Centre,Union Ministers,Union Government,Union Agriculture Ministry,Mango News,Mango News Telugu,Farmer Unions,Farmer Unions Call Meeting,Farmers Protest Live,Farmer Unions Begin Talks Once Again,Farmers,Indian Union Ministers,Union Ministers Meet To Discuss Protests Farmers,Farmers Protest,Farmer Unions Begin Talks With Centre,Delhi,Farmer Leaders,Farmer Unions Once Again With Centre

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు 40 రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయుష్‌ గోయల్ మూడో రౌండ్ చర్చలు జరుపుతున్నారు. రైతులు ఇప్పటికే తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఈసారి చర్చల్లో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతుల ఆందోలనకు సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలపై తన వ్యతిరేకతను మరోసారి తెలియజేశానని, సమస్యను త్వరగా పరిష్కరించమని కోరినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 13 =