కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

CM KCR Visit Kaleshwaram Project Today, CM KCR Visits Mukteswara Swamy Temple, kaleshwaram, Kaleshwaram Project, kaleshwaram project news, kcr kaleshwaram project, KCR Reviews Kaleshwaram Project, Mango News, Mukteswara Swamy, Mukteswara Swamy Temple, Mukteswara Swamy Temple in Kaleshwaram, telangana, Telangana CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్‌ దంపతులు కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాణహిత గోదావరి సంగమస్థలి పుష్కర ఘాట్ వద్ద తల్లి గోదారమ్మకు పుష్పాంజలి ఘటించారు. పసుపు కుంకుమలను, నాణాలను నీటిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం తదనంతర నిర్మాణం సందర్భంగా ఎదుర్కున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణా రైతన్నకు వెన్ను దన్నుగా నిలుస్తూ తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్న ప్రాణహిత గోదావరి జలదృష్యాన్ని చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అధికార్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారని సీఎం అభినందించారు.

అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి, మేడిగడ్డ బ్యారేజ్ (లక్ష్మీ) వద్దకు సీఎం చేరుకోనున్నారు. బ్యారేజ్ పరిసరాల్లో పర్యటించిన అనంతరం అక్కడే అధికారులతో నీటి నిల్వ, పంపింగ్‌, యాసంగికి సాగునీటి విడుదల వంటి అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే సీఎం కేసీఆర్ లంచ్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ