తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం?

CM KCR, CM KCR will Discuss when to Start Classes in Educational Institutions, Educational Institutions, Educational Institutions In telangana, Educational Institutions Reopen News, Mango News Telugu, Telangana CM KCR, Telangana Educational Institutions, Telangana Educational Institutions Reopen, Telangana Educational Institutions Reopen News

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా గత కొన్నినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. అయితే విద్యార్థులకు భౌతికంగా పాఠశాలలు ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. జనవరి 11 న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖపై కూడా కీలకంగా చర్చించనున్నారు.

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ