ఈసారి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది – ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ

BJP National Executive Meet PM Modi Addresses Vijaya Sankalpa Sabha at Secunderabad Pared Ground, PM Modi Addresses Vijaya Sankalpa Sabha at Secunderabad Pared Ground, Modi Addresses Vijaya Sankalpa Sabha at Secunderabad Pared Ground, BJP National Executive Meet, Vijaya Sankalpa Sabha at Secunderabad Pared Ground, Secunderabad Pared Ground, Vijaya Sankalpa Sabha, PM Modi addresses Vijay Sankalp Sabha, Prime Minister Narendra Modi will address a public meeting at Parade Grounds in Secunderabad, public meeting at Parade Grounds in Secunderabad, Vijaya Sankalpa Sabha News, Vijaya Sankalpa Sabha Latest News, Vijaya Sankalpa Sabha Latest Updates, Vijaya Sankalpa Sabha Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

బీజేపీ ‘విజయ సంకల్ప సభ’కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన హెచ్‎ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ వేదికకు వెళ్లారు. సభా వేదికకు మోదీ చేరుకోగానే ఒక్కసారిగా మోదీ, మోదీ.. జై బీజేపీ అంటూ సభా ప్రాంగణమంతా మారుమోగిపోయింది. బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో మోదీకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. ఈ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగించారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధానమంత్రి సభికులని ఆకట్టుకున్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయడం అందరినీ ఆకర్షించింది. దీనిపై ప్రధాని కూడా హర్షం వ్యక్తం చేశారు. మీ అభిమానానికి, ప్రేమకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, ఆదిత్యనాథ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ ఒక పుణ్య స్థలం.. ప్రాచీన సంస్కృతికి, పరాక్రమానికి తెలంగాణ పెట్టింది పేరు.
  • కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది.
  • ఈ గడ్డపై పుట్టిన సాహిత్యకారులు దేశవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించారు.
  • భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్‌ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి.
  • సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ లక్ష్యంతో తెలంగాణను అభివృద్ధి చేస్తాం.
  • కరోనా కష్టకాలంలో తెలంగాణ లోని ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాం.. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం.
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మంచి ఫలితాలను అందించారు, దీంతో మా బాధ్యత మరింత పెరిగింది.
  • త్వరలో తెలంగాణలో మెగా టెక్సటైల్ పార్క్ నిర్మిస్తాం.
  • తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పకుండా ఏర్పాటు చేస్తుంది.
  • డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =