ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ భేటీ ‌

AP CS Adityanath Das, AP CS Adityanath Das Meets SEC Nimmagadda Ramesh, AP CS meet SEC Nimmagadda over local body elections, AP CS meets SEC, AP Local Body Elections, AP Local Body Elections News, AP News, AP SEC Nimmagadda Ramesh Kumar, Mango News Telugu, Nimmagadda Ramesh Kumar, SEC Nimmagadda Ramesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గతకొంతకాలంగా ప్రతిష్టంభన నెలకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్ తో ప్రభుత్వం తరపున ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ నేతృత్వంలోని‌ బృందం శుక్రవారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుమారు గంటన్నర పాటుగా వారు ఎస్ఈసీతో చర్చించినట్టుగా తెలుస్తుంది.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో‌ ఫిబ్రవరి నెలలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, వ్యాక్సిన్ పంపిణీ పక్రియ పూర్తయ్యేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ నేతృత్వంలోని బృందం ఎస్ఈసీ కోరినట్టు సమాచారం. ఎస్ఈసీ కలిసిన వారిలో సీఎస్ ఆదిత్యనాథ్ తో పాటుగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్,‌ పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here