యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR, KCR Reviews On Yadadri Temple Construction Works, KCR will Review on the Yadadri Temple Construction, yadadri, yadadri temple, Yadadri Temple Construction, Yadadri Temple Construction News, Yadadri Temple Construction Updates, Yadadri Temple Construction Works

యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. యాదాద్రి దేవాలయం వద్ద చేపట్టే నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎం సమీక్షిస్తారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు యాదాద్రిలో పర్యటించి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించి సూచనలు చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ