ఉప్పుగల్, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

Minister Errabelli Dayakar Rao Held Review on the Progress of Uptugal, Palakurti and Chennur Reservoirs,Minister Errabelli Dayakar Rao,eld Review on the Progress,Uptugal Reservoirs, Palakurti Reservoirs,Chennur Reservoirs,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

దేవాదుల ఎస్.ఆర్.ఎస్పీ నీటి కాలువల ద్వారా నిర్మితమవుతున్న నష్కల్-ఉప్పుగల్, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితి, పూర్తి కావాల్సిన పనుల పురోగతి పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ జిల్లా పరిషత్ లో గల తన పేషీలో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమారు, ఈఎన్సీ మురళీధర్ రావు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందిచేలా కృషి జరగాలి. ఇందులో భాగంగా దేవాదుల ఎస్.ఆర్.ఎస్పీ కాలువ నీటిని అందించడంలో సమస్యలను వెంట వెంట పరిష్కరించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా నిర్మితమయ్యే మూడు రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని 36 గ్రామాలకు మొత్తం 45,055 ఎకరాల ఆయకట్టుకు సాగనీరు అందుతుంది. దేవాదుల ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే నష్కల్-ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దే పల్లి ముత్తారం, తిరుమలాయ పల్లి, కొండూరు, కేశవపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, బురహాన్ పల్లి, అవుతాపురం, గంట్లకుంట, పోచంపల్లి, చిన్నవంగర, ఏడునూతుల, రేగుల గ్రామాలు ఉండగా, 25,652 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని చెప్పారు.

అలాగే పాలకుర్తి రిజర్వాయర్ కింద దర్దేపల్లి, లక్ష్మీనారాయణ పురం, ముత్తారం, విస్నూరు, పాలకుర్తి, వల్మీడి, చెన్నూరు, మంచుప్పుల, తీగారం, ఏడునూతుల గ్రామాలు ఉండగా మొత్తం ఆయకట్టు 7,515 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక చెన్నూరు రిజర్వాయర్ కింద చెన్నూరు, మంచుప్పుల, లక్ష్మక్క పల్లి, రామ వరం, పాఖాల, మోండ్రాయి, కొడకండ్ల, మన్ పహాడ్, దేవరుప్పుల, ధర్మపురం గ్రామాల్లో 11,888 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని వివరించారు. ఇందుకోసం ఉప్పు గల్లు, పాలకుర్తి, చెన్నూరు, రిజర్వాయర్ లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

జాఫర్ గడ్- పాలకుర్తి చెరువులను రిజర్వాయర్ లు గా చేస్తున్నామన్నారు. పాలకుర్తి నియోజవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, మండలాల్లో ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందిచాల్సి ఉందని అన్నారు. ఈ ఎండాకాలంలోనే నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, కాలువ క్లియర్ చేసి అలైన్ మెంట్ సరి చేయాలన్నారు. శాశ్వత ప్రాతిపాదికన చెరువులు నింపేలా పనులు పూర్తి చేయాలని, కెనాల్స్ క్రాసింగ్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్లను షిప్ట్ చేయాలని, ఈ పని కొసం ఇంజనీరింగ్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని అదేశించారు. కాలువలు , రిజర్వాయర్లు, భూ సేకరణ, లైనింగ్, వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. చెరువుల్లోకి నీరు వెళ్ళాలి అవి నీరుతో నిండాలి ఎలాంటి ఇబ్బందులూ ఉన్నా వెంటనే పరిష్కరించాలి అని చెప్పారు. అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది, కాంట్రాక్టర్లు, ఆయా పనుల్లో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. రెండు నెలల్లో చెరువులలోకి నీరు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fourteen =