భారత్ నుంచి వెళ్లే విమానాలపై చైనా తాత్కాలిక బ్యాన్

China Bans Indian Flights, China Bans Indian Flights due to Corona, China Bans Indian Flights due to Corona Concerns, China Coronavirus, China Coronavirus Lockdown, China Coronavirus News, China Temporarily Bans Indian Flights, Indian Flights, Indian Flights Banned By China

కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశ విమానాలపై చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి విమానాల ద్వారా పౌరులు ఆ దేశంలోకి ప్రవేశించడాన్ని చైనా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 30 వ తేదీన వందే భారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుంచి వుహాన్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 20 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భారత్ తో పాటుగా బెల్జియం, యూకే, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ప్రయాణికులపై కూడా చైనా ఇలాంటి తాత్కాలిక నిషేధాన్ని విధించింది.

కరోనా కారణంగా చెల్లుబాటు అయ్యే చైనా వీసాలు, నివాస అనుమతులు కలిగి ఉన్న భారత పౌరులును చైనాలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగానే నిషేధం విధించాం, అయితే దౌత్య‌ప‌ర‌మైన‌, సేవాప‌ర‌మైన‌, సీ వీసాలు ఉన్న‌వారికి ఈ నిషేధం వ‌ర్తించ‌దని చైనా ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. అలాగే అత్య‌వ‌స‌ర అవసరంతో వచ్చేవారు ఎంబ‌సీలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని పేర్కొన్నారు. చైనా తాజా నిర్ణయంతో వందే భారత్ మిషన్ లో భాగంగా నవంబర్ 13 మరియు డిసెంబర్ 4 మధ్య ఎయిర్ ఇండియా చైనాకు షెడ్యూల్ చేసిన నాలుగు విమానాలపై ప్రభావం పడనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =