టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. అపాయింట్‌మెంట్ ఇవ్వని ఈడీ, సీబీఐలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TPCC Chief Revanth Reddy Key Comments On ED And CBI For Not Giving Appointment In TSPSC Paper Leakage Issue,TPCC Chief Revanth Reddy Key Comments On ED,Revanth Reddy On CBI For Not Giving Appointment,TSPSC Paper Leakage Issue,TPCC Chief Revanth Reddy,Mango News,Mango News Telugu,Probe Paper Leak By CBI,KTR Sends Legal Notice To Cong,TSPSC Question Paper Leak,SIT Quizzes A Revanth Reddy,TPCC Chief Revanth Reddy Demands TSPSC,TPCC Chief Revanth Reddy Latest News,TSPSC Paper Leakage News Today,TSPSC,TSPSC Paper Leakage Latest Updates

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐల అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఆ రెండు సంస్థల నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు అనుమానాస్పదంగా ఉందని, ప్రశ్నప్రత్నం లీకేజీపై ప్రశ్నించినందుకు తనకు నోటీసులు ఇచ్చారని.. అయితే తప్పు చేసిన మంత్రి కేటీఆర్‌కు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే దీని వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఉన్నందున వారిని కాపాడేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

గడచిన రెండు మూడు రోజులుగా ఈడీ, సీబీఐ అపాయింట్‌మెంట్ల కోసం తాను ప్రయత్నిస్తున్నానని, అయితే ఆయా సంస్థల డైరెక్టర్లు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక ఎంపీగా తాను అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన ఆయన ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని తెలిపారు. అలాగే హవాలాతో పాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయని, దీనిలో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయని, అయితే కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.

ఇక మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి, ఈ కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డి పక్క పక్క మండలాలకు చెందినవారని, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా రాజశేఖర్ రెడ్డిని చేర్చుకోవడంలో తిరుపతి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ పాత్ర కూడా ఉందని, కేసులో విచారణ జరగకముందే, నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోకముందే.. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అంటూ మంత్రి కేటీఆర్ ఎలా చెప్పారు? అని రేవంత్ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని, వారికి సరైన న్యాయం జరగాలంటే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయగా.. సిట్ ముందు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సమర్పించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =