కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. అయితే దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం నారాయణపేట్ జిల్లా మక్తల్ నుంచి పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు పాదయాత్ర సాగనుంది.
ఈ క్రమంలో రాహుల్ యాత్ర తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. తెలంగాణాలో ఎనిమిది జిల్లాల పరిధిలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. అక్టోబర్ 27న తెలంగాణలోని మెహబూబ్‌నగర్ నుండి తిరిగి ప్రారంభమవనుంది. రోజుకు దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇక రాహుల్ యాత్రకు టీపీసీసీ విసృత ఏర్పాట్లు చేసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాహుల్ యాత్రను సమన్వయం చేసుకునేలా తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం నవంబర్ 7న నాందేడ్ మీదుగా రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. కాగా భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ అనే నాలుగు రాష్ట్రాల్లోని 18 జిల్లాలను కవర్ చేస్తూ 1,230 కి.మీ. కొనసాగింది.
తెలంగాణలో రాహుల్ పాదయాత్ర షెడ్యూల్..
పార్లమెంట్ నియోజకవర్గాలు: మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్.
అసెంబ్లీ నియోజకవర్గాలు: నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్.
హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలు: ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY