గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత కాంగ్రెస్ నేత ముకేశ్ గౌడ్ తనయుడు, తెలంగాణ కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్ పార్టీ మార్పుకై నిర్ణయించుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇంచార్జిగా నియమితులైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణల సమక్షంలో శుక్రవారం నాడు విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ విక్రమ్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఇటీవలే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ