ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే

AP Assembly session, AP Assembly Winter Session, ap cabinet meet, AP Cabinet Meet news, AP cabinet meeting, AP Cabinet Meeting 2020, AP Cabinet Meeting Decisions, AP Cabinet Meeting Highlights, AP Cabinet Meeting Key Decisions, AP Cabinet To Meet Today, AP CM YS Jagan, Mango News, YSRCP Cabinet Meeting, YSRCP Cabinet Meeting Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • నివర్ తుఫాన్ తో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ బాధిత రైతులకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం.
  • రూ.9,027 కోట్లతో వైఎస్‌ఆర్‌ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం. డిసెంబర్ 21 నుండి ప్రారంభం.
  • డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమోదం.
  • మొత్తం 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం. తొలిదశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం, మూడుదశల్లో జూన్ 2022 నాటికీ ఇళ్లనిర్మాణం పూర్తి. ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం.
  • డిసెంబర్ 2 న ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభం.
  • డిసెంబర్ 8న వైఎస్ఆర్ చేయూత లబ్దిదారులకు 2.49లక్షల యూనిట్ల గొర్రెలు, మేకలు పంపిణీ.
  • డిసెంబర్ 15 న వైఎస్ఆర్ పంటభీమా చెల్లింపులకు నిర్ణయం.
  • కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు కోత విధించిన వేతనాలు, పింఛనర్లకు సంబంధించి విధించిన పింఛన్స్ కోతను డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లించాలని నిర్ణయం. వేతనాలకు రూ.2324 కోట్లు, పింఛన్స్ కు రూ.482 కోట్లు చెల్లింపు.
  • ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల చెల్లింపుతో పాటుగా, 3.144 శాతం డీఏ పెంపుకు ఆమోదం.
  • అంగన్ వాడీ, హోమ్ గార్డ్స్ వేతన బకాయిలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం.
  • తుఫాన్ ప్రభావంతో 10 వేల మందికి పునరావాస శిబిరాలకు తరలింపు. వారికీ తక్షణ సాయంగా రూ.500 ఇవ్వాలని నిర్ణయం.
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం.
  • ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ బిల్లుకు ఆమోదం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =