రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పర్యటన.. హాజరు కావడం లేదని స్పష్టం చేసిన ఎంపీ కోమటిరెడ్డి

Congress MP Komatireddy Clarifies To Not Attending TPCC Chief Revanth Program in Nalgonda Tomorrow, MP Komatireddy Clarifies To Not Attending TPCC Chief Revanth Program, TPCC Chief Revanth Program in Nalgonda Tomorrow, Congress MP Komatireddy Clarifies To Not Attending TPCC Chief Revanth Program in Nalgonda, Congress MP Komatireddy, Congress MP, Komatireddy, MP Komatireddy, Komatireedy Venkat Reddy, TPCC chief Revanth Reddy, Telangana Pradesh Congress Committee, Telangana Pradesh Congress Committee chief Revanth Reddy, Revanth Reddy Nalgonda Tour, Revanth Reddy Nalgonda Tour News, Revanth Reddy Nalgonda Tour Latest News, Revanth Reddy Nalgonda Tour Latest Updates, Nalgonda, Mango News, Mango News Telugu,

తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో.. సదరు కార్యక్రమానికి హాజరు కావడం లేదని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభకు జన సమీకరణ కోసం నల్గొండ జిల్లాలో ఏ నాయకుడూ పర్యటించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేతలు తప్పనిసరిగా పర్యటించాలని, అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న నల్గొండ జిల్లాలో ఎలాంటి పర్యటనలూ చేయాల్సిన పనిలేదని కోమటిరెడ్డి అన్నారు.

అయితే మే 6న వరంగల్ పట్టణంలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చేందుకు రేపు నల్గొండ జిల్లాకు వెళ్లటానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రేపటి కార్యక్రమానికి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉండడం వల్ల రేవంత్ కార్యక్రమానికి వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. కాగా జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరియు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యతిరేకించడంతో జిల్లాలో రేవంత్‌ సన్నాహక సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం.. జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పార్టీలోని సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని కలవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =