తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ మాదిరిగానే ఈసారి కూడా.. గులాబి పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీలకు కేసీఆర్ మెండి చేయి చూపించారు. దీంతో ఆయా పార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. హస్తం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సీపీఎం, సీపీఐ పార్టీలు పావులు కదుపుతున్నాయి.
అయితే సీపీఎం, సీపీఐ పార్టీలు చెరో అయిదు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఎదుట ప్రతిపాదన పెట్టాయి. కానీ కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ పార్టీ నేతలతో చర్చలు జరిపి.. చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారట. అది కూడా ఒకటి కోరుకున్న సీటు.. రెండోది వేరొకచోట ఇస్తామని అన్నారట. కానీ రెండు టికెట్లు తాము కోరుకున్న చోటే ఇవ్వాలని సీపీఎం, సీపీఐ పార్టీలు పట్టుబడుతున్నాయట.
అటు సీపీఐకి ఆ పార్టీ కోరుకున్నట్లుగానే కొత్తగూడెం.. మరో స్థానం చెన్నూరు టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీపీఎం కోరుకున్నట్లుగానే మిర్యాలగూడ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సముఖత వ్యక్తం చేసిందట. అయితే రెండో సీటు కింద పాలేరు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతోందట. ఆ సీటు కోసం జాతీయ స్థాయిలో సీపీఎం నేతలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారట. కానీ అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈక్రమంలో సీపీఎంకు ఇచ్చే రెండో స్థానంపై సందిగ్ధత నెలకొంది.
మరోవైపు మిర్యాలగూడ సీపీఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారట. తమకే ఆ సీటు కేటాయించాలని పట్టుబడుతున్నారట. సీపీఎంకు ఆ స్థానం కేటాయిస్తే.. ఎట్టి పరిస్థితులోనూ ఎన్నికల్లో సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారట. అవసరమైతే.. స్వతంత్రంగా కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయిపోతున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY