చంద్రబాబుకు మళ్లీ షాక్.. రిమాండ్ పొడిగింపు

Chandrababu Naidu Remand Extended,naidu remand extended,chandrababu remand extended,chandrababu naidu,Mango News,Mango News Telugu,chandrababu naidu, skill development scam case, ap, ap acb court, tdp,Chandrababus remand in skill case ends today,Skill Scam Case,Andhra Pradesh High Court declines,Chandrababu Naidu Latest News,Vijayawada ACB court extends Case,Chandrababu Naidu Latest Updates,Chandrababu Remand Latest News
chandrababu naidu, skill development scam case, ap, ap acb court, tdp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. జైలు నుంచి బయటకొచ్చేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే పేరుమోసిన న్యాయవాదులు.. చంద్రబాబు కోసం పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబుకు మాత్రం ఊరట లభించడం లేదు. తాజాగా మరోసారి చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది.

గతంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో జైలు అధికారులు చంద్రబాబు నాయుడును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ మేరకు వాదోపవాదనలు విన్న కోర్టు కోర్టు చంద్రబాబు రిమాండ్‌ను మరోసారి పొడిగించింది. నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  అలాగే చంద్రబాబు ఆరోగ్యం పట్ల కోర్టు ఆరా తీసింది. ఎప్పటికప్పుడు చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

మరోవైపు తన భద్రతా విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. తనకు హాని చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని అంటూ వివరించారు. అయితే తాను చెప్పే అంశాలను రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి.. చంద్రబాబుకు సూచించారు. అలాగే చంద్రబాబు రాసిన లేఖను తమకు పంపించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. వారంలో రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌తో మధ్యలో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రారంభించాలని భువనేశ్వరి నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =